ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు అత్యంత భారీ భద్రత నడుమ పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఆస్పత్రిని పాకిస్తాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు.. కేవలం వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, దావుద్ ఇబ్రహీం ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌కు పోలీసులు భద్రత పెంచారు. అతనితో పాటు కుటుంబసభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు. మియాందాద్ అతని సమీప బంధువు కావడమే అందుకు కారణం. దావూద్ ఇబ్రహీం కుమార్తెను జావేద్ మియాందాద్ కుమారుడు వివాహమాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.
As per multiple news reports, former Pakistani cricketer Javed Miandad, along with his family, has been placed under house arrest by the Pakistan Army and ISI.
— All About Cricket (@allaboutcric_) December 18, 2023
Javed Miandad is allegedly a close relative of the most wanted criminal, Dawood Ibrahim.
This action may be linked… pic.twitter.com/KFi1A33uE8
ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి
1993లో ముంబై(అప్పటి బాంబే) నగరంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వెనుక దావూద్ ఇబ్రహీం హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో 257 మంది అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. 1,400 మందికి పైగా గాయపడ్డారు.
#DawoodIbrahim, India’s most wanted criminal, poisoned in Pakistan: Report @alysonle brings you this report
— WION (@WIONews) December 18, 2023
Read more: https://t.co/DtMdsz6MYx pic.twitter.com/O36TCzPveT