Lakshmipathy Balaji: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ!

Lakshmipathy Balaji: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ!

భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తవ్వగా, ఇప్పుడు బీసీసీఐ బౌలింగ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. బౌలింగ్ కోచ్‌గా పరాస్ మహంబ్రే స్థానంలో.. మాజీ సీమర్ లక్ష్మీపతి బాలాజీని ఎంపిక చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో బాలాజీ పేరు ఖరారు కాలేదని, అతనికి పోటీగా లెఫ్ట్‌హ్యాండ్ పేసర్ జహీర్ ఖాన్ రేసులో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. చివరగా, వీరిద్దరిలో ఒకరు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న టాక్ వినపడుతోంది.

గంభీర్ ప్రతిపాదనకు.. నో 

బౌలింగ్ కోచ్ పదవికి కర్ణాటక మాజీ పేసర్ వినయ్ కుమార్ పేరును గౌతమ్ గంభీర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ అతని పట్ల ఆసక్తి చూపడం లేదని మీడియా వర్గాలు తెలిపాయి. జహీర్ ఖాన్ లేదా లక్ష్మీపతి బాలాజీలలో ఒకరికి బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. 

జహీర్.. మెన్ ఇన్ బ్లూ తరుపున 92 మ్యాచ్‌ల్లో 311 టెస్ట్ వికెట్లు,  మొత్తం 309 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 610 వికెట్లు తీశాడు. ఇక, బాలాజీ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 37.18 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఇక వన్డేల విషయానికొస్తే, 30 మ్యాచ్‌ల్లో 39.52 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు.

గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాక భారత జట్టుకు కొత్త సహాయక సిబ్బందిని నియమించారు.