విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!

విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌‌తో తెగతెంపులు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట విడిపోయారని, విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కారనే ప్రచారం జరుగుతోంది. విడాకుల అనంతరం పాండ్యా భరణం కింద భార్య నటాషాకు తన ఆస్తిలో 70 శాతం వాటా ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎక్కడ చెడింది..?

హార్దిక్, నటాషా విపోయారని కానీ.. విడాకులు తీసుకోబోతున్నారని కానీ అధికారికంగా ఏలాంటి ప్రకటన బయటకు రాలేదు. ఇదంతా సోషల్ మీడియా ద్వారానే విస్తృత ప్రచారం జరుగుతోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. నాలుగు రోజుల క్రితం పాండ్యా సతీమణి  తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా పేరును తొలగించింది. అప్పటి నుంచి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో నటాషా స్టాంకోవిచ్ పాండ్యా అని ఉంటే ఇప్పుడు దానిని నటాషా స్టాంకోవిచ్(natasastankovic__)కే పరిమితం చేసింది. 

అందునా, మార్చి 4న నటాషా పుట్టినరోజు. ఆ రోజు పాండ్యా తన భార్యకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు మొదలయ్యాయి. ఇవి రోజురోజుకూ మరితంగా వ్యాపిస్తూ.. విడాకులు, భరణం వరకూ తీసుకొచ్చాయి. అయితే, ఈ విషయంపై ఆ జంట, వారి స్నేహితులు, కుటుంబసభ్యులు ఎవరూ నోరు విప్పలేదు.

ఎవరీ నటాసా స్టాంకోవిచ్..? 

నటాషా సెర్బియా  దేశస్థురాలు. తండ్రి పేరు గోరన్ స్టాంకోవిక్. తండ్రి పేరు రాడ్మిలా స్టాంకోవిక్‌. సెర్బియా మోడల్ అయిన నటాషాను పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కోవిడ్ మహమ్మారి నిర్బంధంలో ఉన్న సమయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు అగస్త్య అనే కుమారుడు 2020 జులై 30న జన్మించాడు. 

ఇక పాండ్యా ఆస్తుల విషయానికొస్తే.. వడోదర, ముంబై ప్రాంతాల్లో అతనికి చాలా ఆస్తులున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముంబైలో రూ.30 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌, వడోదరలో పెంట్ హౌస్ వంటి ఖరీదైన విల్లాలున్నాయట. ఇక ఐపీఎల్‌ తో  బాగా సంపాదిస్తున్నాడు. ముంబై జట్టు నుంచి రూ.15 కోట్లు ఫీజుగా అందుకున్నాడు. అలాగే, భారత జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నందకూ కోట్లలోనే ఆదాయం అందుతుంది. పైగా కొన్ని బ్రాండ్‌లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా భారత  ఆల్‌రౌండర్ రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @natasastankovic__

ఐపీఎల్ వల్లే ఈ కథనాలు..!

ప్రస్తుత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. తొలిసారి ముంబై జట్టుకు నాయకత్వం వహించిన పాండ్యా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో పదింట ఓడిన హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శన తరువాతే అతనిపై ఈ పుకార్లు వస్తున్నాయి.