రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్, ఓవర్ యాక్షన్ స్టార్ రియాన్ పరాగ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఈ యువ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అస్సాం తరఫున ఆడుతున్న పరాగ్.. గత 10 మ్యాచ్‌ల్లో 85 సగటుతో 510 పరుగులు చేశాడు. అంతేకాదు, వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో అతనికి జాతీయ జట్టు సెలెక్టర్ల నుంచి పిలుపు రానుందని సమాచారం.
వన్డే వరల్డ్ కప్ అనంతరం నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతి కల్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఫలితంగా దేశవాళీ టోర్నీలు రాణిస్తున్న పరాగ్‌తో పాటు మరికొందరు యువ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నారని సమాచారం. త్వరలో జట్టు ప్రకటన వెలువడనుంది.
? REPORTS ?
— Sportskeeda (@Sportskeeda) November 6, 2023
Riyan Parag might get India call-up for the T20I series against Australia. ?#RiyanParag #Cricket #T20 #Sportskeeda pic.twitter.com/TK30xPfE6M
ఆల్‌రౌండర్
21 ఏళ్ల పరాగ్ ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల సమర్ధుడు. గడిచిన ఎడిషన్లలో ఈ యువ క్రికెటర్ అడపాదడపా రాణించినప్పటికీ.. గతేడాది మాత్రం పూర్తిగా విఫలయ్యాడు. అయితే, దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. వరుసగా అర్ధశతకాలు బాధేస్తున్నాడు. గత 10 మ్యాచ్ ల్లో ఏకంగా ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు. స్ట్రైక్ రేట్ 182కి పైగా ఉంది.
Riyan Parag in SMAT 2023:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023
Runs - 510.
Wickets - 11.
- He becomes the first Indian to score 500+ runs and pick 10+ wickets in a T20 tournament. pic.twitter.com/mHfM6R1cfl
ఇండియా vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్
- ఫస్ట్ టీ20 (నవంబర్ 23): వైఎస్ఆర్ స్టేడియం(విశాఖపట్నం)
- రెండో టీ20 (నవంబర్ 26): గ్రీన్ ఫీల్డ్ స్టేడియం (తిరువనంతపురం)
- మూడో టీ20 (నవంబర్ 28): బర్సప్ప స్టేడియం (గుహవటి)
- నాలుగో టీ20 (డిసెంబర్ 01): విధర్భ క్రికెట్ గ్రౌండ్ (నాగపూర్)
- ఇదో టీ20 (డిసెంబర్ 05): రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)