అతి వేగంగా ప్రయాణించినందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పూణే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై హిట్ మ్యాన్ గంటకు 200 కి.మీ, 215 కి.మీ. వేగంతో దూసుకెళ్లాడట. దీంతో ట్రాఫిక్ పోలీసులు రోహిత్ కారుకు మూడు చలాన్లు విధించారు.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం భారత్-బంగ్లాదేశ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ తన లంబోర్గిని ఉరుస్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ అతి వేగంగా డ్రైవింగ్ చేయడం పట్ల ట్రాఫిక్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని సూచించారు.
ALSO READ : ఐఐటీ ఖరఖ్పూర్ మెదక్ స్టూడెంట్ ఆత్మహత్య
Rohit Sharma issued 3 challans for overspeeding at the Mumbai-Pune highway.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 18, 2023
He was crossing 200kmph while driving. (Pune Mirror). pic.twitter.com/52ghlg7b3m
కాగా, వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయిన హిట్ మ్యాన్.. ఆ తరువాత రెండు మ్యాచ్ ల్లోనూ ఇరగదీశాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 84 బంతుల్లో 131 పరుగులు, ఆస్ట్రేలియాపై 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు.
Rohit Sharma and his wife in the Lamborghini. pic.twitter.com/AY4QwllWA6
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023