IPL 2025 Mega Auction: కమ్మిన్స్ ప్లేస్‌లో రోహిత్.. మెగా ఆక్షన్‌కు ముందు సన్ రైజర్స్ మాస్టర్ ప్లాన్

IPL 2025 Mega Auction: కమ్మిన్స్ ప్లేస్‌లో రోహిత్.. మెగా ఆక్షన్‌కు ముందు సన్ రైజర్స్ మాస్టర్ ప్లాన్

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 రూల్స్ వచ్చేశాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక ప్రయోగాత్మక మార్పు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ ను మెగా ఆక్షన్ లోకి వదిలేసే అవకాశాలు ఉన్నాయి. కమ్మిన్స్ స్థానంలో అంతే మొత్తం(రూ. 20 కోట్లు) చెల్లించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉందట. 

ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్య కొనసాగుతున్నాడు. అతనితో పాటు సూర్య కుమార్ యాదవ్, బుమ్రాను రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖాయం. అయితే రోహిత్ విషయంలో ముంబై పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. ఇప్పటికే ముంబైలో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. పైగా రోహిత్ వయసు 37 ఏళ్ళు కావడంతో అతడిని జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రోహిత్ మెగా ఆక్షన్ లోకి వస్తే పంజాబ్, లక్నో జట్లతో పాటు సన్ రైజర్స్ అతడిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. 

Also Read :- సఫారీలకు ఏమైంది.. చివరి వన్డేలో ఐర్లాండ్‌పై ఓడిన దక్షిణాఫ్రికా

కమ్మిన్స్ ను మెగా ఆక్షన్ లోకి వదిలేసి అతన్ని RTM కార్డు ద్వారా జట్టులోకి తీసుకోవాలని భావిస్తోందట. అదే జరిగితే సన్ రైజర్స్ జట్టులో రోహిత్, కమ్మిన్స్ ఇద్దరూ ఉంటారు. ఐపీఎల్ లో తొలి మూడు సీజన్ లు రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన సంగతి తెల్సిందే. అతడికి హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది. దీంతో రోహిత్ ను సన్ రైజర్స్ జట్టులో తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. రిటైన్ ప్లేయర్ల లిస్టులో ట్రావిస్ హెడ్, హేన్రిచ్ క్లాసన్, అభిషేక్ శర్మ తీసుకోవడం దాదాపుగా గ్యారంటీ.