భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు వరించింది. శనివారం(జనవరి 31) ముంబైలో జరగనున్న బోర్డ్ వార్షికసమావేశంలో భారత క్రికెటర్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు.
భారత జట్టు తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు గౌరవార్థం ఈ అవార్డులు ప్రధానం చేస్తున్నారు. 1994 నుంచి ఇప్పటివరకూ 30 మంది క్రికెటర్లు ఈ అవార్డు అందుకున్నారు. టెండూల్కర్ 31వ గ్రహీత. గతేడాది భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వికెట్ కీపర్ గ్రేట్ ఫరోక్ ఇంజనీర్లు ఈ బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
ALSO READ | U19 Women’s T20 World Cup: అండర్-19 టీ20 ప్రపంచ కప్.. ఫైనల్లో టీమిండియా
24 ఏళ్ల సుధీర్ఘ క్రికెట్ కెరీర్ సచిన్‌ది. భారత్ జట్టు తరఫున 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్. గొప్ప బౌలర్ కూడానూ. 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడిన సచిన్.. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు, 201 వికెట్లు ఉన్నాయి. 2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. తన సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్ సచిన్.