సానియాతో విడాకులు.. సనాతో పెళ్లి.. మాలిక్ రాసలీలలపై పాక్‌లో కథనాలు

సానియాతో విడాకులు.. సనాతో పెళ్లి.. మాలిక్ రాసలీలలపై పాక్‌లో కథనాలు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల జంట విడిపోయి వారం రోజులు గడుస్తున్నా.. వీరిపై కథనాలు ఆగడం లేదు. విడాకులకు దారితీసిన పరిస్థితులేంటి..? ఎవరిది తప్పు..? ముందు ఎవరు విడాకులిచ్చారు..? అంటూ పాక్ మీడియాలో రోజుకో కథనం వెలుగులోకి వస్తున్నాయి.  

షోయబ్ మాలిక్ స్త్రీ లోలుడని, అతనికున్న వివాహేతర సంబంధాలే విడాకులకు దారితీశాయని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవైపు సానియా మీర్జాతో తన బంధం కొనసాగుతుండగానే, షోయబ్ మరికొందరితో రాసలీలలు నడిపారనేది ఈ కథనాల సారాంశం. యాడ్ షూట్లలో కలిసి నటించే మోడళ్లను అతను వలలో వేసుకునేవాడని, వారితో విచ్చలవిడిగా డేటింగ్ చేసేవాడని చర్చించుకుంటున్నారు. అందుకు పాకిస్తానీ మోడల్ అయేషా ఒమర్‌తో అతను సన్నిహితంగా దిగిన ఫోటోలను ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారు. వారు దిగిన ఫోటోలలో కొన్ని శృంగార భంగిమలు పోలి ఉండటంతో.. ఈ వార్తలు నిజమనే వారు లేకపోలేదు.

సనాతో పెళ్లి

ఇలా పలువురు మోడళ్లు, సెలెబ్రిటీలతో షోయబ్ సంబంధాలు కొనసాగిస్తుండగానే సనాతో అతనికి పరిచయం ఏర్పడినట్లు ఓ పాక్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. మాలిక్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాకే.. ఆమె తన మాజీ భర్తతో విడిపోయిందని, గత మూడేళ్ళుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనేది వస్తున్న వార్తల సారాంశం. వీటిని మానుకోవాలని పాక్ క్రికెటర్‌ను హెచ్చరించినప్పటికీ.. అతను పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. చివరకు వీటితో విసిగిపోయిన భారత టెన్నిస్ స్టార్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆలోచించి విడాకుల నిర్ణయం తీసుకుందనేది జరుగుతున్న ప్రచారం.

కాగా, మొదట అయేషా సిద్దిఖీని రహస్యంగా వివాహమాడిన షోయబ్.. 2010లో ఆమెకు విడాకులిచ్చిన వెంటనే సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆమెకు గుడ్ బై చెప్పి.. పాకిస్తానీ నటి సనా జావేద్ ను మనువాడాడు.