Shreyas Iyer: మనసు మార్చుకున్న అయ్యర్.. రంజీ సెమీస్‪కు సిద్ధం

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ మాట లెక్క చేయనట్లుగా తెలుస్తోంది. ఆటగాడు ఫిట్‌గా ఉంటే..దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఇటీవల సూచించినా.. అయ్యర్ మాట వినలేదు. ఫిబ్రవరి 16న  నుండి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ తర్వాత రౌండ్ ఆడాలని.. BCCI ప్రారంభంలో ఆటగాళ్లకు మెయిల్ చేసింది. అయితే అయ్యర్ రంజీ ట్రోఫీలో దూరంగా ఉంటూ ఐపీఎల్ లాంటి క్యాష్ లీగ్ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చ తారాస్థాయికి చేరుకుంది. తాజాగా మనసు మార్చుకుని రంజీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

క్వార్టర్ ఫైనల్ మిస్ అయినా.. ముంబై సెమీస్ కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ కోసం అయ్యర్ ను ఎంపిక చేశారు. అతను టీమ్ ఇండియా నుంచి రెండో టెస్ట్ లు విఫలమైన తర్వాత చివరి మూడు టెస్టులకు పక్కన పెట్టారు. గాయం కారణంగా అయ్యర్ ను పక్కన పెట్టినా ప్రస్తుతం అయ్యర్ కు ఎలాంటి గాయం లేదని తెలుస్తుంది. అతను పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉన్నానని..ముంబై సెమీ-ఫైనల్ మ్యాచ్‌కి అందుబాటులో ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెప్పినట్లు నివేదికలు చెబుతున్నాయి.

       
మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్‌లో ముంబైతో తమిళనాడు తలపడనుంది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ వరుసగా 35, 13, 27, 29 పరుగులు చేశాడు. దీంతో సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయ్యర్  గత 12 నెలల నుంచి వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది (2023) మార్చిలో వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఈ క్రమంలో IPL 2023 తో పాటు WTC ఫైనల్‌కు దూరమయ్యాడు. 2023 ఆసియా కప్ కు భారత జట్టులో చేరాడు.