IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. గాయంతో సూర్య కుమార్ యాదవ్ ఔట్

ఐపీఎల్ ప్రారంభం కాక,ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీ20 నెంబర్ వన్ బ్యాటర్, టీమిండియా సూపర్ స్టార్ సూర్య కుమార్ యాదవ్ ప్రారంభ ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తుంది. నివేదికల ప్రకారం మొదటి రెండు మ్యాచ్ లకు ఈ టీ20 స్పెషలిస్ట్ అందుబాటులో ఉండడని తెలుస్తుంది. దీని ప్రకారం 24 న గుజరాత్ టైటాన్స్ తో తొలి మ్యాచ్, 27 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో రెండో మ్యాచ్ కు బెంచ్ కు పరిమితం కాక తప్పదు. 

ALSO READ :- శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్​పోస్టర్​ఆవిష్కరణ

ఈ రెండు మ్యాచ్ ల తర్వాత సూర్య అందుబాటులో ఉంటాడా అంటే చెప్పలేని పరిస్థితి. ఐపీఎల్ తర్వాత జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకొని ఈ ముంబై బ్యాటర్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ముంబై ఇండియన్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. చీలమండ గాయంతో ఇబ్బందిపడిన సూర్య 2024 జనవరి నెలలో సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.   

ఐపీఎల్ లో సూర్య కుమార్ యాదవ్ కు తిరుగులేని రికార్డ్ ఉంది. 139 మ్యాచ్ ల్లో 3000 లకు పైగా పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా చివరి టీ20 ఆడుతూ సూర్య గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఇబ్బంది పడివుతూనే మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ కు దూరమయ్యాడు.