Virat Kohli: రామ మందిర ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న అయోధ్యకు విరాట్ దంపతులు

Virat Kohli: రామ మందిర ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న అయోధ్యకు విరాట్ దంపతులు

ఈ నెల జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఆరోజున మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో రామ్‌లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ ఘడియల కోసం యావత్‌ భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలావుంటే, ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు హాజరుకానున్నట్లు సమాచారం. 

జనవరి 21న నెట్ సెషన్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి అయోధ్యకు బయలుదేరి వెళ్లనున్నారట. ఆ మరుసటి రోజు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని.. తిరిగి హైదరాబాద్ పయనం కానున్నరట. ఈ మేరకు కోహ్లీ ఇప్పటికే బీసీసీఐ నుంచి అనుమతి పొందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అఫ్ఘనిస్థాన్‌తో టి20 సిరీస్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లకు మరియు కోచింగ్ సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది. ఈ విరామం అనంతరం ఆటగాళ్లు, సిబ్బంది  హైదరాబాద్‌ చేరుకొని నెట్స్ సెషన్‌ మొదలుపెట్టాలి. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. 

ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
  • రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
  • మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
  • నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
  • ఐదో టెస్ట్(మార్చి 07 - మార్చి 11): ధర్మశాల