భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్యూమాతో తెగదెంపులు చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాడు. విరాట్ మున్ముందు ప్యూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ స్థాపించిన అజిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోకున్నారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే ప్యూమాను వీడినట్లు తెలుస్తోంది.
2017లో కోహ్లీ.. ఎనిమిదేళ్ల కాలానికి ప్యూమాతో రూ. 110 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ముగియనుంది. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ బిల్‌బోర్డ్‌లు, టెలివిజన్ స్క్రీన్‌లు మరియు వివిధ సోషల్ మీడియా వీడియోల్లో కనిపించారు.
Virat Kohli will end his 8-year contract worth 110cr with Puma India and join Agilitas Sports as its Brand Ambassador and will also hold equity in Agilitas Sports. (CNBC TV18). pic.twitter.com/afYe6DQ9Qg
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2024