IND vs ENG, 2nd Test: వైజాగ్ టెస్ట్ నీకు చివరిది.. గిల్‌ను హెచ్చరించిన ద్రవిడ్

IND vs ENG, 2nd Test: వైజాగ్ టెస్ట్ నీకు చివరిది.. గిల్‌ను హెచ్చరించిన ద్రవిడ్

హైదరాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. సీనియర్ బ్యాటర్ పుజారా ఫామ్ లో ఉన్నా.. గిల్ మీద నమ్మకంతో వరుసగా అవకాశలు ఇచ్చారు. అయితే పుజారా స్థానంలో వచ్చిన గిల్ ఏ మాత్రం ఆకట్టులేకపోయాడు. వెస్టిండీస్, సౌతాఫ్రికా టూర్ లో వరుసగా విఫలమైన గిల్.. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో డకౌటయ్యాడు.
 
గిల్ చివరి 10 ఇన్నింగ్స్ లు చూసుకుంటే ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ చేరుకోలేకపోయాడు. దీంతో హైదరాబాద్ టెస్ట్ తర్వాత గిల్ కు జట్టు యాజమాన్యం రంజీ ట్రోఫీ ఆడమని సలహా ఇచ్చినట్టు కొన్ని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత టీమ్ మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌కు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడానికి విశాఖపట్నం టెస్టు తనకు చివరి అవకాశం అని శుభ్‌మన్ గిల్‌కు సమాచారం అందిందట. 
 
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో రెండో టెస్ట్ తర్వాత మూడో టెస్ట్ జరగడానికి వారం రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్ లో గిల్‌ని తన లోపాలను పరిష్కరించడానికి దేశవాళీ క్రికెట్‌కు పంపాలని జట్టు చర్చలు జరిపిందట. ఫిబ్రవరి 9 నుంచి మొహాలీలో పంజాబ్, గుజరాత్ మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడేందుకు శుభ్‌మన్ గిల్ అంగీకారం తెలిపాడట. డొమెస్టిక్ క్రికెట్ ఆడటం గురించి గిల్ తన కుటుంబ సభ్యులలో ఒకరికి తెలియజేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

వైజాగ్ లో జరిగిన టెస్ట్ లో గిల్ తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోసారి భారీ స్కోర్ చేయడంలో విఫలమైన ఈ యువ బ్యాటర్ కు మూడో టెస్టులో స్థానం దక్కదని భావించారు. అయితే తనని తాను నిరూపించుకోవడానికి గిల్ తన చివరి ప్రయత్నంలో సఫలమయ్యారు. కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీతో సత్తా చాటాడు. 147 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 104 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. గిల్ సెంచరీతో భారత్ 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచగలిగింది. 

ఈ రోజు జరిగిన మ్యాచ్ లో భారత్ విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్ లో జాక్ క్రాలి(29), నైట్ వాచ్ మ్యాన్ రెహన్ అహ్మద్(9) ఉన్నారు.రెండో ఇన్నింగ్స్ భారత్ 255 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకు ఆలౌటైంది.