సదర్ ను అధికారికంగా నిర్వహించడంపై సంతోషం

సదర్ ను అధికారికంగా నిర్వహించడంపై సంతోషం
  • అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు

అంబర్​పేట, వెలుగు: సదర్ సమ్మేళనాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా నిర్వహించాలని చెప్పడంతోపాటు తక్షణమే జీఓ జారీ చేయడంపై అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్ అధ్యక్షతన బుధవారం అంబర్​పేటలో కార్యవర్గ సమావేశం జరిగింది.

జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెం ట్ చింతల రవీంద్రనాథ్ యాదవ్ పాల్గొని సీఎం రేవంత్​రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మ ణ్ యాదవ్ మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో యాదవులందరూ యాదవ్ అని తప్పక రాపించాలని కోరారు. జాతీయ కార్యదర్శి రమేశ్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎం.రాజేం దర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.