- మంత్రి ఉత్తమ్‌కు ఉమ్మడి జిల్లా ప్రతినిధుల వినతి
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి పూర్తిచేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని, ఉమ్మడిజిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విజయరమణ రావు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా డీ83, డీ86 కాలువల కింద 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు. రిజర్వాయర్ నిర్మాణం జరిగితే పెద్దపల్లి జిల్లా రైతులకు సాగునీటి సమస్యలు తీరుతాయని వినతిపత్రంలో వివరించారు.