ప్రభుత్వం మారితే తప్పా యువత భవిష్యత్​ మారదు : విద్యార్థి సంఘాల ప్రతినిధులు

కామారెడ్డి టౌన్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తప్పా యువత బతుకులు బాగుపడవని కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. గడిచిన పదేండ్లలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు రియంబర్స్​మెంట్​ ఇవ్వడం లేదన్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట అబాసు పాలైందన్నారు. నిరుద్యోగ భృతి హామీని కూడా బీఆర్ఎస్​ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించి ఉద్యమ గడ్డ రుచిచూపించాలన్నారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు లక్ష్మణ్​ యాదవ్, సురేశ్, ఐరేని సందీప్, అరుణ్, విఠల్, జబ్బార్, రోషణ్, భరత్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.