సీఎంను కలిసిన పౌల్ట్రీ అసోసియేషన్స్ ప్రతినిధులు..

సీఎంను కలిసిన పౌల్ట్రీ అసోసియేషన్స్ ప్రతినిధులు..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  భయం లేకుండా   చికెన్, గుడ్లను ప్రజలు తినాలని,  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో దీనిని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని  పౌల్ట్రీ అసోసియేషన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 

తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (టీపీబీఏ) ప్రతినిధులు జీ రమేష్ బాబు, డీ రామ్‌‌‌‌ రెడ్డి, కేజీ ఆనంద్‌‌‌‌,  తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్‌‌‌‌) ప్రతినిధులు  కే మోహన్ రెడ్డి, వీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ రావు,  నేషనల్ ఎగ్‌‌‌‌ కోఆర్డినేషన్స్‌‌‌‌ కమిటీ (నెక్‌‌‌‌) ప్రతినిధి జీ చంద్రశేఖర్ రెడ్డి, పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఉదయ్ సింగ్ బాయస్‌‌‌‌, సంజీవ్‌‌‌‌ చింతావర్‌‌‌‌‌‌‌‌ సీఎంను కలిశారు. 

తమ విన్నతులకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని పౌల్ట్రీ అసోసియేషన్స్‌‌‌‌ ప్రకటించాయి.