గర్ల్స్ హాస్టల్‌‌‌‌కు ఫండ్స్‌‌‌‌ కేటాయించాలి 

  •     సీఎంను కోరిన రెడ్డి సంఘం ప్రతినిధులు 

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్​ సిటీలో రెడ్డి విజ్ఞాన పరిషత్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గర్ల్స్  హాస్టల్‌‌‌‌కు రూ.2కోట్లు కేటాయించాలని ఆర్బీవీఆర్ రెడ్డి సంఘం ప్రతినిధులు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కోరారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లోని సీఎం నివాసంలో ఆయనను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా  సీఎంకు బోకే అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో  అనాథల వృద్ధాశ్రమానికి  స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై సీఎం  సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, ట్రెజరర్ మధుకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.