కేసీఆర్​ గెలుపు కామారెడ్డికి శక్తి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కామారెడ్డి, వెలుగు:  సీఎం కేసీఆర్​ కామారెడ్డిలో గెలుపు కామారెడ్డికి శక్తిని ఇవ్వనుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేసీఆర్​ గెలపుతో కామారెడ్డి రూపురేఖలు మారుతాయన్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాకు చెందిన రెడ్డి ఐక్య వేదిక ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్​లో కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కామారెడ్డిలో  కేసీఆర్ ​పోటీ  చేస్తున్నారని  ప్రకటించగానే  కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింద న్నారు. 

అభివృద్ధితో దూసుకెళ్తుందని ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇండస్ర్టీస్​, సంస్థలు వస్తాయని, దీంతో  కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల్లో  ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదన్నారు.  అగ్రవర్ణాలతో పాటు  అన్నివర్గాల సంక్షేమం కోసం  కేసీఆర్​ పనిచేస్తున్నారన్నారు. స్టేట్​లో బీఆర్ఎస్​ గెలుపునకు  తోడ్పాడుతామని ఐక్య వేదిక ప్రతినిధులు కవితకు తెలిపారు.  కార్యక్రమంలో  రెడ్డి ఐక్య వేదిక స్టేట్​ ప్రెసిడెంట్ ఏనుగు సంతోష్​రెడ్డి,  ప్రతినిధులు నాగర్తి చంద్రారెడ్డి,  నల్లవెల్లి కరుణాకర్​రెడ్డి,  రమేశ్​రెడ్డి, రాంరెడ్డి,  బీమ్​రెడ్డి తదితరులు ఉన్నారు.