
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 942 మంది పోలీసు, అగ్నిమాపక, పౌర రక్షణ సిబ్బందికి వివిధ విభాగాల్లో శౌర్య, సేవా పతకాలు అందించనున్నట్లు తెలిపింది కేంద్రం.ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. వీటిలో 95 శౌర్య పతకాలు ఉన్నట్లు తెలిపింది.ఈ అవార్డు గ్రహీతలలో పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు సివిల్ డిఫెన్స్ సిబ్బంది, కరెక్షనల్ సర్వీసెస్ సేవల్లో పనిచేస్తున్న వారు ఉన్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన 28 మంది, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 28 మంది, ఈశాన్య ప్రాంతంలో ముగ్గురు, ఇతర ప్రాంతాల్లో 36 మందిని గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది ప్రభుత్వం. 101 రాష్ట్రపతి పతకాలలో 85 పోలీసు సిబ్బందికి, 5 అగ్నిమాపక సిబ్బందికి, 7 సివిల్ డిఫెన్స్, హోంగార్డు సర్వీస్‌లకు 4 పతకాలు కరెక్షనల్ సర్వీసెస్ కి అందించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
తెలంగాణ నుంచి 21 మంది పోలీస్ సిబ్బంది ఎంపికైనట్లు సమాచారం. వీరిలో పోలీసు సిబ్బందిలో విశిష్ట సేవలకు 2, మెరిటోరియస్ సర్వీస్ కి 12, అగ్నిమాపక విభాగంలో మెరిటోరియస్ సర్వీస్ కి 3, హోంగార్డు విభాగంలో మెరిటోరియస్ సర్వీస్ 4 పతకాలు ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రపతి పతకాలకు అందుకోనున్న తెలంగాణ అధికారులు వీరే:
పోలీసు విభాగం:
కార్తికేయ, ఇన్‌స్పెక్టర్ జనరల్,
అన్నల ముత్యం రెడ్డి, పోలీసు సూపరింటెండెంట్,
కమల్ల రామ్ కుమార్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్,
మహమ్మద్ ఫజ్లూర్ రెహమాన్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్,
కోటపాటి వెంకట రమణ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
అన్ను వేణుగోపాల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
రణ్‌వీర్ సింగ్ ఠాకూర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్,
పీటర్ జోసెఫ్ బహదూర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్,
మహ్మద్ మొయినుల్లా ఖాన్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్,
వద్ధ్యా పథ్యా నాయక్, హెడ్ కానిస్టేబుల్,
అనుమల నిరంజన్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్,
ఎండీ అయూబ్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్
అగ్నిమాపక విభాగం:
వేంకటేశ్వర రావు మోరుబోయిన, లీడింగ్ ఫైర్‌మెన్
సుబ్బయ్య చావల, లీడింగ్ ఫైర్‌మెన్,
జనార్దన్ కారుకూరి, లీడింగ్ ఫైర్‌మెన్,
హోంగార్డు విభాగం:
ఈశ్వరయ్య మంత్రి, హోమ్ గార్డ్
యాదగిరి మేడిపల్లి, హోమ్ గార్డ్
లక్ష్మణ్ కోమటి, హోమ్ గార్డ్
అయిలయ్య కళ్లెంల, హోమ్ గార్డ్