ప్రతియేటా మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం.. జనవరి 26,1950 నభాతర రాజ్యాంగాన్ని ఆమోదించారు.అప్పటినుంచి భారత రాజ్యాంగ నిర్మాణం ఆమోదం జ్ణాపకంగా ప్రతియేటా జవనరి 26న జాతీయ సెలవు దినంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి 2025 జనవరి 26న ఆదివారం నాడు 76వ గతణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నాం. ఈ ప్రత్యేక వేడకల్లో సెలబ్రేట్ చేసుకునే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం..
రిపబ్లిక్ డే 2025 థీమ్
ప్రతియేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ థీమ్ ను ఏర్పాటు చేసుకుంటాం.. 2025థీమ్ సర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్.. అంటే బంగారు భారతదేశం వారసత్వం, అభివృద్ది.. ఇది మన దేశ గొప్ప సాంస్కృతిర వారసత్వాన్ని, కొనసాగుతున్న పురోగతిని తెలియజేస్తుంది.
గణతంత్ర దినోత్సవం 2025 ముఖ్య అతిథి
2025 గణతంద్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది మన ప్రభుత్వం. ఇది భారత్, ఇండోనేషియా మద్య దౌత్య సంబంధాల విషయంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
రిపబ్లిక్ డే చరిత్ర
ప్రతియేటా మనం జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) వెనక ఉన్న చరిత్రను ఒకసారి చూద్దాం.. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సొంత పాలనపరమైన సొంత రాజ్యాంగం లేదు.. దీంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు.
Also Read :- AI డీట్ యాప్లో ఉద్యోగానికి ఇలా అప్లయ్ చేసుకోవాలి..!
ఈ సభ కృషితో భారత రాజ్యాంగం రూపొందించారు. 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో తుది ముసాయిదాను ప్రవేశపెట్టింది.. అనంతరం కొన్ని నెలల తర్వాత జనవరి 26, 1950 న మొదటి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత రాజ్యాంగాన్ని త్రివర్ణ పతాకం ఆవిష్కరించడం ద్వారా ప్రారంభించారు. ఆతర్వాత జనవరి 26న రిపబ్లిక్ గా గుర్తించారు.
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత
రిపబ్లిక్ డే రాజ్యాంగ విలువల నిబద్ధతను హైలైట్ చేస్తుంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్య ఆదర్శాలకు భారతదేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన వేడుక కూడా. వేడుకల సందర్భంగా ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు భారతదేశం గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.
ఈ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడం, భిన్నత్వంలో భారతదేశం బలాన్ని ఎత్తిచూపడం,జాతీయ ఐక్యతను పెంపొందించడం, భారతదేశానికి స్వతంత్రం రావడానికి, గణతంత్రాన్ని నిర్మించడంలో సహాయపడిన నేతలు, స్వాతంత్ర్య సమరయోధుల పరాక్రమం, త్యాగాలకు గుర్తించి గణతంత్ర దినోత్సవం రోజున నివాళులర్పిస్తూ గౌరవిస్తుంచడం జరుగుతుంది.