రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు దేశానికే చాలా ప్రత్యేకం. అందుకే స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 26 వచ్చిందంటే చిన్నప్పుడు స్కూల్లో జరిగే జెండా వందనం హడావిడితో పాటు చాక్లెట్లు, ఆటపాటలు గుర్తొస్తాయి. పెద్దయ్యే కొద్దీ ఆ సెలబ్రేషన్సిని మర్చిపోతూ ఉంటారు. కానీ ఆ రోజులను మరోసారి గుర్తుచేసుకుంటూ ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు జరుపుకోవచ్చు.
పెరేడ్ చూడాలి
రిపబ్లిక్ రోజు స్పెషల్ గా చూడాల్సిన వాటిల్లో పెరేడ్ ఒకటి. దేశంలో ఎక్కడెక్కడినుంచో చాలామంది పెరేడ్‌ను చూడానికి డిల్లీ వస్తారు. క్రమశిక్షణతో చేసే విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చూస్తే ఎవరిదైనా గొప్ప ఫీలింగ్ కలగక మానదు.. అందుకే ఈ రోజు ఎప్పుడు చూసే టీవీ ప్రోగ్రామ్స్ కి బ్రేక్ ఇచ్చి దేశభక్తిని పెంచే పెరేడ్ విన్యాసాలు చూడొచ్చు.
లోకల్ రిపబ్లిక్ టూర్
రిపబ్లిక్ డే సందర్భంగా ఒకసారి లోకల్ టూర్ వేసిరావొచ్చు, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో రిపబ్లిక్ డే సందర్భంగా రోడ్లు, పబ్లిక్ ప్లేసులన్నీ మూడురంగులతో మెరిసిపోతూ ఉంటాయి.. చారిత్రక కట్టడాలను కూడా జెండా రంగుల్లో ముస్తాబు చేస్తారు. వీలుంటే అలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చూసిరావచ్చు. వాటితో పాటు రిపబ్లిక్ డే వచ్చిందంటే ఆన్లైన్లో. బయట షాపింగ్ మాల్స్‌లో డిస్కౌంట్ సెల్స్ నడుస్తూ ఉంటాయి. వీలుంటే వాటికి కూడా వెళ్లిరావొచ్చు.
గౌవరంగా
రిపబ్లిక్ డే రోజు దేశానికి గౌవరంగా కొన్ని చిన్న రూల్స్ కూడా పాటించొచ్చు. నాన్వెజ్‌కు నో చెప్పడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం వల్ల రిపబ్లిక్ డేకు రెస్పెక్ట్ ఇచ్చినవాళ్లమవుతాం. అలాగే ఈ రోజు స్పెషల్‌గా కొన్ని వాలంటరీ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. స్కూల్‌కి లేదా ఆశ్రమాలకు వెళ్లి వాళ్లతో గడపడం వాలంటర్ పసులు చేయడం లాంటివి ట్రై చేయెచ్చు.
డ్రెస్ డిఫరెంట్
రిపబ్లిక్ డే ను డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఆ రోజు డ్రెస్సింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. తెలుపు రంగు బట్టలు వేసుకుని షర్టుపైన జెండాను ధరిస్తే పేట్రియాటిక్ లుక్ వస్తుంది. అలాగే పిల్లలకు రకరకాల డిజైన్స్ లో ఉండే మూడురంగుల డ్రెస్లు వేయొచ్చు. ఇవే కాకుండా చెవి రింగులు, రిస్ట్ బ్యాండ్లు లాంటివి కూడా మూడురంగులవి ఎంచుకుంటే రిపబ్లిక్ డే స్పెషల్ గా, పేట్రియాటిక్ లుక్‌తో కనిపించొచ్చు.
ALSO READ | జనవరి 25 షట్ తిల ఏకాదశి .. పూజా విధానం .. పాటించాల్సిన నియమాలు ఇవే..
సినిమాతో..
ఈ రిపబ్లిక్ డే ఎలాగూ సండే వచ్చింది కాబట్టి ఇంట్లో గడిపేవాళ్లే ఎక్కువ మంది. అందుకే ఒక మంచి దేశభక్తి సినిమాతో ఎంజాయ్ చేయొచ్చు. టీవీలో ప్రతి రిపబ్లిక్ డేకి ఏదో ఒక పేట్రియాటిక్ మూవీ టెలీకాస్ట్ అవుతుంది. అది నచ్చకపోతే ప్రైమ్,నెట్ ఫ్లిక్స్ లో కూడా బోలెడన్ని పేట్రియాటిక్ మూవీస్ ఉంటాయి. వాటినిచూస్తూ ఎంజాయ్ చేయచ్చు.
ఎకో రిపబ్లిక్ డే
రిపబ్లిక్ డే రోజు ఇళ్లు, క్లాసురూములు, ఆఫీసులు, రోడ్లన్నీ మూడురంగులతో మెరిసిపోతూ ఉంటాయి. ఎక్కడ చూసినా తళతళ మెరుస్తూ ప్లాస్టిక్ జెండాలే కనిపిస్తాయి. రిపబ్లిక్ డే అయిపోయిన తెల్లారే ఆ కాగితాలన్నీ ప్లాస్టిక్ చెత్తగా మారతాయి. అలాకాకుండా మనవంతు బాధ్యతగా పద్యావరణాన్ని కాపాడాలంటే రిపబ్లిక్ డేను ఎకో ఫ్రెండ్లీగా జరువుకోవచ్చు. ప్లాస్టిక్ జెండాలకు బదులు పేవర్ జెండాలు లేదా సీడ్ పేపర్ జెండాలు వాడొచ్చు. సీడ్ పేపర్ ఫ్లాగ్స్ ను బయట పడేయకుండా ఇంట్లో కుండలో వెస్తే వాటి నుంచి మెక్కలు కూడా పెరుగుతాయి.
స్పెషల్ క్రాప్ట్స్
పిల్లలు ఈరోజు కొత్తగా క్రాఫ్ట్స్ తో ఆటలాడించొచ్చు. రిపబ్లిక్ డే ధీమ్ తో క్రాఫ్ట్స్ తయారు చేయించడం. క్రాఫ్ట్స్ గేమ్స్ ఆడించడం.. పెయింటింగ్స్ గీయించడం లాంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లలకు రిపబ్లిక్ డే ప్రత్యేకతను తెలియజేసిన వాళ్లమవుతాం. అలాగే రోజంతా పిల్లలతో టైంపాస్ చేసినట్టూ ఉంటుంది.
== వెలుగు లైఫ్