- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, రైల్వే కాంప్లెక్స్‌లో ఆకట్టుకున్న విన్యాసాలు
- భారీ త్రివర్ణ పతాకాలతో గల్లీల్లో ర్యాలీలు
సిటీ నెట్ వర్క్, వెలుగు : మహానగరంలో రిపబ్లిక్‌డే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్జిల్లాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీ, ప్రైవేట్‌సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జెండా ఎగరవేశారు. సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బల్దియా హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డితో కలిసి కమిషనర్ఇలంబరితి పోలీస్ వందనాన్ని స్వీకరించారు.
హైదరాబాద్కలెక్టరేట్ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్లు కదిరవన్ పలాని, ముకుంద రెడ్డి, డీఆర్ఓ వెంకటాచారితో కలసి కలెక్టర్ అనుదీప్, మెట్రో రైల్ భవన్ లో హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సీపీ అవినాష్ మహంతి, పాతబస్తీలో ఎంఐంఎ అధినేత, ఎంపీ అసదుద్దీన్ఒవైసీ, సనత్‌నగర్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిమ్స్ లో డైరెక్టర్ ఎన్.బీరప్ప, గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ప్రొఫెసర్రాజకుమారి, మెడికల్‌కాలేజీ లో ప్రిన్సిపాల్ప్రొఫెసర్డా.కె.ఇందిర
Also Read :- కాళేశ్వరం పంప్‌హౌస్‌లపై విచారణ లేదా
హెచ్ఎండీఏ హెడ్డాఫీసులో కమిషనర్సర్ఫరాజ్ అహ్మద్, వాటర్‌బోర్డులో ఎండీ అశోక్ రెడ్డి, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో జాయింట్కమిషనర్రమేశ్కుమార్, తార్నాకలోని ఆఫీసులో డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, ఓయూ ఆర్ట్స్‌కాలేజీ వద్ద వీసీ ప్రొ.కుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీలో డైరెక్టర్ అభిలాష బిస్ట్, కొంగరకలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, వికారాబాద్కలెక్టరేట్లో కలెక్టర్ప్రతీక్ జైన్, శామీర్‌పేటలోని మేడ్చల్ కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్, విద్యానగర్ వెల్ఫేర్హాస్టల్లో ఎంపీ ఆర్.కృష్ణయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్, స్పెషల్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. విన్యాసాలు అబ్బురపరిచాయి.
2 వేల అడుగుల తిరంగా ర్యాలీ
సనత్ నగర్ మాదిగల జేఏసీ, మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేటలో 2 వేల ఫీట్ల పొడవున్న జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కవాడిగూడ సీజీవో టవర్ నుంచి ఐడీహెచ్‌కాలనీ వరకు కొనసాగింది. 300 మంది స్టూడెంట్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ఫైటర్స్వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. రాజ్భవన్గవర్నమెంట్స్కూల్లో 100 శాతం అటెండెన్స్ఉన్న ఎస్సెస్సీ స్టూడెంట్స్‌కు రూ.500చొప్పున అందజేశారు. గతేడాది ఎస్సెస్సీలో 9.5 జీపీఏ సాధించిన స్వాతి అనే పేద విద్యార్థికి రూ.35 వేలు నగదు అందజేశారు. విద్యార్థులు యోగాసనాలతో అలరించారు.