ములుగు : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద ఎస్సీ కాలనీకి చెందిన బోడ అంజిత్ (28), విజయ్ (25), బోడ కల్యాణ్ అనే ముగ్గురు యువకులు కలిసి జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప బొంగుకు విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురు యువకులు కరెంట్‌షాక్ కు గురయ్యారు.
వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో అంజిత్, విజయ్ చనిపోయారు.కల్యాణ్ పరిస్థితి విషమంంగా ఉంది. ఆస్పత్రిలో కల్యాణ్ చికిత్స పొందుతున్నాడు. ములుగు పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏరియా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.