రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌ 26 రూపాయలే.. రెడీగా ఉండండి

రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌ 26 రూపాయలే.. రెడీగా ఉండండి

జనవరి 26.. గణతంత్ర దినోత్సవం వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే 2025 సందర్భంగా కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్‌ వంటి అత్యాధునిక మిస్సైల్స్ తోపాటు సంజయ్‌, ప్రళయ్‌ వంటి యుద్ధ నిఘా వ్యవస్థలు, వ్యూహాత్మక క్షిపణులు కనువిందు చేయనున్నాయి. దేశ పౌరుల ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేలా భారత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా(LAVA) సరికొత్త ఆఫర్లు ప్రకటించింది.

రిపబ్లిక్ డే సేల్..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లావా కంపెనీ Prowatch ZN స్మార్ట్‌వాచ్, Probuds T24 ఇయర్‌బడ్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ వేరబుల్స్ ధర రూ. 26 మాత్రమే. కాకపోతే, ఈ అవకాశం మొదటి వంద మందికి మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 26, 2025 మధ్యాహ్నం 12 గంటలకు Lava e-storeలో ప్రారంభమవుతుంది. కావున ఇప్పుడే రిమైండర్ సెట్ చేసుకొని పెట్టుకోండి. 

అన్ని వేరియంట్లపై ఫ్లాట్ 76 శాతం డిస్కౌంట్

రూ.26 ఆఫర్ ముగిసిన తరువాత ప్రోవాచ్, ప్రోబడ్స్ సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై స్టాక్‌ ఉన్నంత వరకు MRP ధరపై ఫ్లాట్ 76 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇది కూడా మంచి ఆఫర్. Prowatch ZN స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు 'Prowatch'ని కోడ్‌ ఉపయోగించాలి. అలాగే, Probuds T24 కొనుగోలుదారులు 'Probuds' కోడ్‌గా ఉపయోగించాలి.