Republic Day Parade 2025: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ఇండియా గేట్ పరేడ్ వెనుక..

Republic Day Parade 2025: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ఇండియా గేట్ పరేడ్ వెనుక..

ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వస్తే మొత్తం దేశమంతా జాతీయ జెండా రంగులు పూసుకుంటుంది. ఎక్కడ చూసినా మన దేశ గొప్పదనాన్ని చాటే పాటలే వినిపిస్తుం టాయి. దేశమంతా ఏకమై జరుపుకునే పండుగ ఎలా ఉంటుందంటే.. జెండా వందనం పండుగలాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

రిపబ్లిక్ డే అనగానే జెండా ఎగరెయ్యడం, జాతీయ గీతం పాడటం. స్వీట్లు పంచడం, ప్రపంచానికి మనదేశ గొప్పదనాన్ని చెప్పడం.. వీటన్నింటితో పాటు పిల్లల దగ్గర్నుంచి పెద్దలవరకు చేసే సంబురాలు గుర్తొస్తాయి.ఢిల్లీలోని ఇండియా గేట్ గుర్తొస్తుంది. 

అక్కడ జరిగే పరేడ్ గుర్తొస్తుంది. దేశమంతా ఆసక్తిగా చూసే ఆ పరేడ్ కి ఎలా ప్రిపేర్ అవుతారు? దానివెనుక జరిగే కథేంటి?

ఇవ్వాళ జనవరి 26  రిపబ్లిక్ డే: దేశం మొత్తానికీ ఈ పండుగ రోజు.భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా 1950 నుంచి ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే సంబురాలు జరుపుకుంటూనే ఉన్నాం. 

స్వతంత్ర భారతదేశాన్ని ప్రపంచ పటం మీద ఒక గొప్ప దేశంగా నిలిపిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది. దేశాన్ని, దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. ముఖ్యంగా ఢిల్లీలోని రాజ్ పథ్ రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పరేడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి ఇండియా గేట్ దగ్గర జరిగే పరేడ్‌ని చూసేందుకు లక్షల మంది జనం వస్తుంటారు. ఆర్మీ పరేడ్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనతో  రాజ్ పథ్ కళకళలాడుతుంది.

ALSO READ | మహాకుంభ మేళా..మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు..10 కోట్ల మంది వచ్చే చాన్స్

వేలాది మంది సైనికులు దాదాపు వంద సంస్థలు కలిసి నిర్వహించే పరేడ్ జరిగేది కొన్ని గంటలే అయినా అందుకోసం పడే కష్టం కొన్ని నెలలది. ఇవ్వాళ రిపబ్లిక్ డే అయిపోవడంతోనే.. వచ్చే ఏడాది కోసం ఇప్పట్నుంచే ప్రిపరేషన్ మొదలవుతుంది.

ఈ కొన్ని గంటలు, దేశ రాజధానిలో అంత పెద్ద పరేడ్, ఏ ఆటంకం లేకుండా టైమ్ కి జరిగిపోతుందంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది.

1. భారత రాష్ట్రపతికి ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ గౌరవ వందనం చేసిన తర్వాత పరేడ్ మొదలవుతుంది.  జాతీయ గీతాన్ని సరిగ్గా అప్పుడే ఆలపిస్తారు. రాజ్ పథ్ లో మొదలై ఎర్రకోట దగ్గర పరేడ్ ముగుస్తుంది.2.  దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తారు.

3. పరేడ్ జరిగే సమయానికి ఎన్నో గంటల ముందే రాజ్ పధ్‌కి వచ్చేసి ఉంటారు సైనికులు. రాత్రి 2 గంటల నుంచే రెడీ అయిపోతారు. అప్పట్నుంచి... ఉదయాన్నే పరేడ్ మొదలయ్యేవరకూ అక్కడే పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ అంతా చివరి నిమిషంలో ఏ తప్పులూ జరగకుండా ఉండటానికే.. అసలైన ప్రాక్టీస్ కొన్ని నెలలకు ముందు నుంచే మొదలై ఉంటుంది.

4.  రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం రావడం అన్నది ఎవ్వరికైనా ఒక గొప్ప అనుభూతి. ఎవరెవరు పరేడ్ పాల్గొంటారో వాళ్ల పేర్లు జూలై నెలలో బయటికొస్తాయి. ఇక అప్పట్నుంచే వాళ్ల వాళ్ల రెజిమెంట్లలో ప్రాక్టీస్ మొదలు పెడతారు సైనికులు.

5. డిసెంబర్ నెల వచ్చేసరికి పరేడ్‌లో పాల్గొనే సైనికులంతా ఢిల్లీకి వచ్చేస్తారు. ఢిల్లీలో రాజ్ పధ్‌కు మనం చూసే పరేడ్ కి ముందు కనీసం ఒక ఆరు ఏడు వందల గంటల పాటు పకడ్బందీగా డ్రిల్ ప్రాక్టీస్ చేస్తారు సైనికులు. ఏ అడుగు ఎలా వేస్తారో వాళ్ల మైండ్లో లో రిజిస్టర్ అయిపోయి ఉంటుందంతే.

6. లక్షలమంది వచ్చే ఈవెంట్, పైగా ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజున 30 వేల మందికి పైనే సైనికులు, పోలీసులు ఢిల్లీలో కాపలా కాస్తుంటారు. రాజ్ పధ్ చుట్టుపక్కలంతా ఇవ్వాల్టికి కొన్ని రోజుల ముందు నుంచే కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి.7.  పరేడ్ మొత్తం 9 కిలోమీటర్లు ఉంటుంది. ప్రాక్టీస్ అప్పుడు మాత్రం దాదాపు 12 కిలోమీటర్లు మార్చ్ పాస్ట్ చేస్తారు.

8. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్.. మన బలగాన్ని, మన దగ్గర ఉన్న వైపన్‌స్‌ను ఈ పరేడ్లో ప్రదర్శిస్తుంది. ఇది దేశ రక్షణ యంత్రాంగం ఎంత పకడ్బందీగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పడం లాంటిది. పరేడ్లో ప్రదర్శించే ప్రతి వెపన్ ఒకటికి పదిసార్లు చెక్ చేశాకే పరేడ్ వరకు వస్తుంది..

9. రిపబ్లిక్ డే రోజున జరిగే పరేడ్‌లో ప్రతి నిమిషానికీ లెక్క ఉంటుంది. ఒక్క నిమిషం కూడా అటూ ఇటు కాకుండా ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. పరేడ్‌లో పాల్గొన్న సైనికులు కూడా నాలుగు దశల్లో సెక్యూరిటీ చెక్‌ని దాటుకొని వెళ్తారు. వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ ని కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేస్తారు.

10.పరేడ్‌లో చాలా ఆకర్షణీయమైనది శకటాల ప్రదర్శన. ఆర్మీతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, సంస్థలు ప్రత్యేకమైన శకటాలను తయారుచేసి ప్రభుత్వానికి పంపి స్తాయి. ఇదంతా కొన్ని నెలలకు ముందు నుంచే జరిగే ప్రక్రియ. పరేడ్‌లో ప్రదర్శనకు ఎంపికైన శకటాల వివరాలను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేస్తుంది. పరేడ్ చూడటానికి వచ్చే వాళ్లకు కనిపించేలా సరిగ్గా అన్నీ ఒకే స్పీడులో వెళ్తుంటాయి. శకటానికి శకటానికి మధ్య కనీసం 100 మీటర్ల గ్యాప్ ఉంటుంది.