వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ జె. ట్రంప్ రాసిన కొత్త పుస్తకం విడుదలైన కొన్ని గంటల్లోనే బెస్ట్ సెల్లర్ గా నిలిచి సంచలంన సృష్టించింది. ‘సేవ్ అమెరికా’ పేరుతో ట్రంప్ రాసిన కొత్త పుస్తకం మంగళవారం అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో విడుదలైంది. హార్డ్ కవర్ పుస్తకం ధర 99 డాలర్లు (రూ. 8,314) ఉండగా.. 7% డిస్కౌంట్తో 92 డాలర్ల(రూ. 7,726)కు ఈ పుస్తకాన్ని ‘విన్నింగ్ టీమ్ పబ్లిషింగ్’ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
ధర భారీగా ఉన్నా.. ఈ బుక్ విడుదలైన కొన్ని గంటల్లోనే భారీగా అమ్ముడుపోయింది. దీంతో అమెజాన్ లో ‘ప్రెసిడెంట్స్, హెడ్స్ ఆఫ్ స్టేట్ బయోగ్రఫీస్’ జాబితాలో ఈ బుక్ నెంబర్ వన్ గా నిలిచింది. ఓవరాల్గా 13వ బెస్ట్ సెల్లర్ పుస్తకంగా ఘనత సాధించింది. తన కొత్త పుస్తకం గురించి ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ప్రచారం చేసుకున్నారు.