వినతి పత్రాలు ఇచ్చినా  ఫలితం లేదు

వినతి పత్రాలు ఇచ్చినా  ఫలితం లేదు
  • అధికారులు, ప్రజాప్రతినిధులను మస్తుసార్లు అడిగినం
  • డ్రైనేజీ, రోడ్లు, తాగు నీరు, శానిటేషన్ ​ఇబ్బందులు పడుతున్నం 
  • కౌన్సిల్​ ముందు పీపుల్స్ ​ఎజెండా పెట్టిన కాలనీ సంఘాలు
  • బల్దియా కౌన్సిల్ మీటింగ్​లో చర్చించాలని  సిటిజెన్స్​ రిక్వెస్ట్

 

హైదరాబాద్, వెలుగు: బల్దియా కౌన్సిల్​ మీటింగ్​పై ఈసారి సిటీ జనాలు భారీ ఆశలనే పెట్టుకున్నారు. దశాబ్దాలుగా ఉన్న పెండింగ్​సమస్యలు పరిష్కారమవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిటీలోని పలు అసోసియేషన్లు, బస్తీ సంఘాలు కార్పొరేటర్లు, అధికారులకు వినతి పత్రాలు  అందజేశారు. ఎమ్మెల్యేలను కూడా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కౌన్సిల్​లో తమ ప్రాంత సమస్యలు చర్చకు వచ్చి పరిష్కారమవుతాయని చూస్తున్నారు. శనివారం బల్దియా కొత్త పాలక మండలి  మీటింగ్ ఫస్ట్​టైమ్ ​ఫిజికల్​గా​జరగనుంది. గతంలో కన్నా భిన్నంగా బలమైన ప్రతిపక్షం ఉండగా తమ సమస్యలన్నీ చర్చకు వస్తాయని సిటీ వాసులు ఇంట్రెస్ట్​తో చూస్తున్నారు. 


కౌన్సిల్​ మీటింగ్ ​సందర్భంగా..
గ్రేటర్ పరిధిలో నాలుగు వేల కాలనీలు, రెండు వేల బస్తీ లు ఉన్నాయి. కాలనీలు రెసిడెన్స్​ వెల్ఫేర్ ​అసోసియేషన్లుగా తమ సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే సమస్యలపై పాలక మండలిలో డిస్కషన్​కు వచ్చినపుడే హామీలు, నిధుల కేటాయింపులు జరుగుతాయని అనుకుంటున్నారు. దీంతో అసోసియేషన్​ ప్రతినిధులు వారం రోజులుగా తమ ప్రాంత ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కలుస్తున్నారు. గ్రేటర్​లోని కాలనీలన్నీ కలిసి యునైటెడ్​ ఫెడరేషన్​ ఆఫ్​రెసిడెంట్ ​వెల్ఫేర్ ​అసోసియేషన్స్​గా ఏర్పడి కామన్​గా ఉన్న కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాయి.  ఓపెన్​ డ్రైనేజీ, డ్రైనేజీ లీక్​, రోడ్లపై మురుగు,  పాడైన డ్రైనేజీ పైపులు, తాగు నీరు, రోడ్లు, పార్కులు, చెరువుల కబ్జాలు, దోమల బెడద, చెత్త , శానిటేషన్​ లేకపోవడం, గాలి, నీళ్లు కాలుష్యం లాంటి సమస్యలున్నాయి. కొన్ని ప్రాంతాలకు కలిపి కామన్​గా ఒకే  సమస్య ఉండగా మరి కొన్ని చోట్ల  ప్రత్యేకమైన ఇబ్బందులు పడుతున్నారు.

మీటింగ్​కు ఫుల్​ సెక్యూరిటీ
బల్దియా కౌన్సిల్ మీటింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం జరిగే కౌన్సిల్​మీటింగ్​అజెండా ప్రకారం ఉదయం 10 గంటలకు మేయర్ అధ్యక్షతన ప్రారంభమవుతుంది. మీటింగ్​కు సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు.
ఎమ్మెల్యే హామీ ఇచ్చినా చేస్తలేడు
‘‘ మా కాలనీలో చాలా కాలంగా డ్రైనేజీ సమస్య ఉంది. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్​పద్మారావు గౌడ్​కు ఎన్ని సార్లు చెప్పినా చేయడంలేదు. ఎమ్మెల్యే కూడా చాలా సార్లు వచ్చి చూసి కొత్త పైపులు వేస్తమని హామీ  ఇచ్చిండు. డివిజన్​ నుంచి డిప్యూటీ మేయర్​గా శ్రీలతా రెడ్డి ఉన్నా మా ప్రాబ్లమ్ తీరట్లేదు– బోదాసు నర్సింహ్మ, మాణికేశ్వరీనగర్.


ఎర్రకుంట చెరువును కాపాడాలె
తార్నాకలో చాలా చోట్ల పార్కులు కబ్జా అవగా కాలనీ వాసులు అడ్డుకొని బల్దియాకు అప్పగించారు.  అయినా వాటిని డెవలప్​ చేయడం లేదు. తిరిగి కబ్జా అయ్యే ప్రమాదం ఉంది. ఎర్రకుంట చెరువు ఎఫ్​టీఎల్​ నిర్ధారణ చేసి ఫెన్సింగ్​వేయమంటున్నా పట్టించుకోవడం లేదు. కాలనీలో  డ్రైనేజీ ఎప్పుడూ పొంగిపొర్లుతోంది. దానికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. దీనిపై బల్దియా మీటింగ్​లో  చర్చించాలె- ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రెసిడెంట్.


 పనులను రైల్వే వాళ్లు అడ్డుకోగా..
 80 ఏండ్ల కిందటి డ్రైనేజీతో పైపులైన్లు పాడై మురుగంతా రోడ్డుపై పారుతోంది. దీంతో దుర్వాసనతో పాటు దోమలు ఉంటుండగా సమస్యపై చాలా కాలం పోరాడితే పనులు మొదలుపెట్టగా రైల్వే వాళ్లు అడ్డుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలె- ఎండీ అక్బర్​, ప్రెసిడెంట్, రైల్​ కళారంగ్​ బస్తీ .


రోడ్డు ఓపెన్​ చేయాలె 
-‘‘ముప్పై నుంచి నలభై గ్రామాలతో పాటు రెండు  మున్సిపాలిటీలు, వందల కాలనీలకు సేవలందించే రోడ్డును వన్యప్రాణుల రక్షణ పేరుతో ఫారెస్ట్ అధికారులు మూసేశారు. ఇది భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంట్​సెగ్మెంట్ల పరిధిలో ఉంది. ఈ సమస్యపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలిస్తే రోడ్డును ఓపెన్ ​చేయమని చెప్పగా, దీనిపై అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ మీటింగ్​లోనైనా రోడ్డు ఓపెన్ ​చేసేందుకు నిర్ణయం తీసుకోవాలె- సతీశ్ సాయి, కాలనీ ప్రెసిడెంట్