మా పిల్లలను వేరే గురుకులానికి మార్చండి

  •     జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకుల స్టూడెంట్ల తల్లిదండ్రుల వినతి
  •     మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పిస్తామని డిప్యూటీ సెక్రెటరీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీ

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు :  ‘జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకులానికి మా పిల్లలను పంపించాలంటే భయంగా ఉంది, ఇద్దరు స్టూడెంట్లు చనిపోవడానికి కారణం ఏంటో చెప్పకుండానే పిల్లలను పంపించాలంటే ఎలా ? పిల్లల భద్రతపై మాకు నమ్మకం లేదు, వారిని వేరే గురుకులానికి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి’ అని స్టూడెంట్ల తల్లిదండ్రులు కోరారు. గురుకులాల డిప్యూటీ సెక్రటరీ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురుకులంలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీస సౌకర్యాలు లేవని, పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో కిందే పడుకోవాల్సి వస్తోందని, టాయిలెట్లు దూరంగా ఉండడంతో రాత్రి పూట పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురుకులంలో చనిపోయిన ఇద్దరు స్టూడెంట్ల పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్టం రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బహిర్గతం చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గురుకులానికి రావడానికి పిల్లలు భయపడుతున్నారన్నారు. 

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

గురుకులంలో ఇటీవలి ఘటనలు ప్రమాదవశాత్తు జరిగినవే తప్ప ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం లేదని గురుకులాల డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం పారిశుధ్య పనులు, రిపేర్లు జరుగుతున్నాయన్నారు. కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక చొరవ తీసుకొని ఫ్యాన్లు, టాయిలెట్ల రిపేర్లు, ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు చేయిస్తున్నారన్నారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు కల్పించి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి ప్రారంభిస్తామన్నారు. స్టూడెంట్లు, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరూ ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వం, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. స్టూడెంట్లకు క్వాలిటీ భోజనం, చదువుతో పాటు భద్రత కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ యూసఫ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి  ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహిపాల్ పాల్గొన్నారు. మరో వైపు ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నారు.