సర్టిఫికెట్లు రద్దు చేయాలని వినతి

పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన తూర్పు కాపులకు దొడ్డి దారిన కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్, తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంపెల్లి కనకేశ్​ఆరోపించారు. ఆ సరిఫికెట్లను రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్​కు మంగళవారం ఆయన వినతి ప్రతం అందజేశారు.  

అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్లు పొందిన పలువురి వివరాలను , ఆధారాలను బయటపెట్టారు. గతంలో స్థానిక తహసీల్దార్ కార్యా లయ సిబ్బంది ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 40 వేల వరకు డబ్బులు తీసు కుని ఫేక్​ సర్టిఫికెట్లు జారీ చేసేవారని ఆయన ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ఆ ధ్రువీకరణ పత్రాల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆకుల ఆనంద్, ఎం. సాంబశివరావు, తోట ప్రవీణ్, లోహిత్ సాయి పాల్గొన్నారు.