మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరపాలని కలెక్టర్​కు వినతి

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరపాలని కలెక్టర్​కు వినతి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరపాలని కౌన్సిలర్లు గురువారం కలెక్టర్​రాజీవ్ గాంధీ హన్మంతును కలిసి మెమోరాండం ఇచ్చారు. జనవరి 4న చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గినందున నోట్​ఫై చేసి, త్వరగా ఎన్నిక జరపాలని కోరారు. నల్గొండ మున్సిపల్ లో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారని, ఆర్మూర్ లో మాత్రం ఎన్నిక జరపకుండా పక్షపాతం వహిస్తున్నారని ఆరోపించారు.