మోకాన్ పల్లి సొసైటీ ఏర్పాటుకు డీసీఓకు వినతి

మోకాన్ పల్లి సొసైటీ ఏర్పాటుకు డీసీఓకు వినతి

 నవీపేట్, వెలుగు : రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మండలంలోని మోకాన్ పల్లి సొసైటీని గతంలో మాదిరిగా కొనసాగించాలని కోరుతూ డీసీఓ శ్రీనివాస్ కు బినోల సొసైటీ పాలకవర్గం వినతి పత్రం అందజేసింది.  కాగా, గతంలో అప్పటి పరిస్థితుల మేరకు మోకాన్ పల్లి సొసైటీని బినోల సొసైటీలో విలీనం చేశారు. అయితే యాథావిధిగా కొనసాగించడానికి  ప్రభుత్వం ఆమోదం తెలపడంతో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు ఆధ్వర్యంలో పాలకవర్గం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.

మోకాన్ పల్లి నుంచి బినోల సొసైటీ కి వెళ్లాలంటే రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పాత సొసైటీ  మోకాన్ పల్లిని యథా విధిగా కొనసాగించాలని చైర్మన్ కోరారు. డీసీఓను కలిసిన వారిలో పాలకవర్గం సభ్యులు భానుచందర్ గౌడ్,  విజయ్, సెక్రటరీ రమేష్ ఉన్నారు.