తెలంగాణలో పోటీ చేయాలని రాహుల్​కు వినతి

తెలంగాణలో పోటీ చేయాలని రాహుల్​కు వినతి

నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్​గాంధీని ఇండియన్​ఓవర్సీస్​కాంగ్రెస్​ లీడర్లు కోరారు. రెండు రోజుల పర్యటన కోసం లండన్​వెళ్లిన రాహుల్​ను శుక్రవారం ఓవర్సీస్​ యూకే శాఖ ఉపాధ్యక్షుడు రంగుల సుధాకర్​గౌడ్​ నేతృత్వంలో కలిసిన ప్రతినిధులు ఈ మేరకు ఆయనకు లెటర్​అందించారు. రాహుల్​గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్​ఫుల్​జోష్​ వస్తుందని, ఆయన పోటీ ప్రభావం మొత్తం సౌత్​ఇండియాపై పడుతుందన్నారు.