గోదావరిఖని, వెలుగు : సింగరేణి కంపెనీ స్థాయి 52వ మైన్స్ రెస్క్యూ పోటీలు మంగళవారం ఆర్జీ 2 ఏరియా పరిధిలోని యైటింక్లయిన్ కాలనీ రెస్క్యూ స్టేషన్, జీడీకే 7 ఎల్‌ఈపీ మైన్‌లో జరిగాయి. ఈ పోటీలను సౌత్ సెంట్రల్ జోన్ (హైదరాబాద్) డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేప్టీ ఉమేశ్ ఎం సావర్కర్, సింగరేణి (ఆపరేషన్స్) డైరెక్టర్ ఎన్‌వీకే శ్రీనివాస్ ప్రారంభించారు. ఇందులో ఆరు జట్లు పాల్గొంటుండగా, జీడీకే 7 ఎల్‌ఇపి మైన్‌లో రెస్క్యూ ఈవెంట్స్, రెస్క్యూ స్టేషన్‌లో ఫస్ట్ ఎయిడ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డీఎంఎస్ ఎన్.నాగేశ్వరరావు, ఏడీఎంఎస్ డాక్టర్ జార్జ్ జాన్, డీడీఎంఎస్ జ్ఞానేశ్వర్, బానోతు వెంకన్న, అప్పలనాయుడు
దిలీప్‌కుమార్, గౌరవ్ లడ్డా, సనత్ కుమార్, ప్రేమ్ కుమార్, కమలేశ్ కుమార్ వర్మ వ్యవహరించారు. కాగా ఇటీవల ఏఎల్‌పీ మైన్‌లో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ చేసిన సిబ్బందిని అభినందిస్తూ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. సింగరేణి (ప్లానింగ్, ప్రాజెక్ట్స్) డైరెక్టర్ జి.వెంకటేశ్వరరెడ్డి, ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు జక్కం రమేశ్, జీఎంలు గురువయ్య, సూర్యనారాయణ, ఎస్.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సుధాకర్‌రావు, వెంకటేశ్వర్లు, ఎస్.సాంబయ్య, గుప్తా, యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.