- ఉత్తరాఖండ్‌లోని టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ
- 3 ఫీట్ల పైప్‌ను లోపలికి పంపించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
- లోపల కార్మికులు సేఫ్‌గా ఉన్నారన్న కేంద్ర మంత్రి వీకే సింగ్
ఉత్తరకాశి : ఉత్తరాఖండ్‌లోని టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఐదోరోజు కొనసాగుతోంది. అమెరికన్ అగర్ మెషీన్ తో డ్రిల్లింగ్ జరుగుతోంది. గురువారం కేంద్ర రోడ్డు రవాణా సహాయ మంత్రి వీకే సింగ్ స్పాట్‌ను పరిశీలించారు. టన్నెల్ లో చిక్కుకున్న 40 మంది కార్మికులను సేఫ్ గా బయటికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మీడియాతో చెప్పారు. అయితే, డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు మట్టిపెల్లలు, బండరాళ్లు పడటంతో ఆటంకం ఎదురైందన్నారు. ఇప్పుడు మెషీన్‌ను పకడ్బందీగా అమర్చామని, రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశం ఉందన్నారు. కార్మికులంతా ఇప్పటివరకు సేఫ్‌గా ఉన్నారని, వాళ్లకు ఆక్సిజన్, ఫుడ్ సప్లయ్ చేస్తున్నామని చెప్పారు.
‘‘కార్మికులతో నేను మాట్లాడాను. వాళ్లలో మనోధైర్యం మెండుగా ఉంది”అని వీకే సింగ్ అన్నారు. కాగా, దాదాపు 3 ఫీట్ల స్టీల్పైప్ను శిథిలాల గుండా టన్నెల్లోకి చొప్పించి, ఆ పైప్లోంచి కార్మికులను బయటికి తీసుకువచ్చేలా అధికారులు ప్లాన్ చేశారు. అందుకు అగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ కొనసాగిస్తున్నారు. గంటకు 5 మీటర్ల చొప్పున ఆ మెషీన్ డ్రిల్ చేస్తోందని, ఆటంకాలు ఎదురుకాకపోతే 12 నుంచి 15 గంట్లలో కార్మికులను సేఫ్‌గా బయటికి తీసుకువస్తామని అధికారులు చెప్తున్నారు. చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఉత్తరకాశీలో నిర్మిస్తున్న సొరంగంలో ముందుభాగం ఈ నెల 12న ఆదివారం కూలిపోయింది. దీంతో 40 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు.
ALSO READ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నియంతే: బైడెన్
నేను సేఫ్ గానే ఉన్నా: కార్మికుడి ఆడియో
ఆక్సిజన్ చేరేలా ఏర్పాటు చేసిన పైప్ ద్వారా టన్నెల్ లో చిక్కుకున్న మహదేవ్ అనే కార్మికుడి వాయిస్ క్లిప్ గురువారం బయటకొచ్చింది. మహదేవ్ అధికారితో మాట్లాడుతూ.. తాను సేఫ్‌గానే ఉన్నానని, ఆందోళన చెందవద్దని తన కుటుంబ సభ్యులకు చెప్పాలని కోరాడు.