ఒకే కుటుంబానికి చెందిన 9మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం..
కరెంటు స్తంభాన్ని పట్టుకుని… ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
మిగిలిన ఆరుగురి కోసం కొనసాగుతున్న గాలింపు
రంగారెడ్డి జిల్లా: భారీ వర్షాలతో వరద నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె చెరువు నిండుకుండలా మారడంతో ఒక్కసారిగా గండి పడిన విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి గండి పడటంతో పల్లె చెరువు పక్కనే ఉన్నా ఆలీనగర్ లోతట్టు ప్రాంతం గా రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. అయినప్పటికీ ఒక కుటుంబానికి చెందిన తొమ్మిది మంది వరద నీళ్లల్లో కొట్టుకు వెళ్లిన ఘటన సంచలనం రేపింది. గల్లంతైన ఈ కుటుంబీకుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వల్ల రెండు డెడ్ బాడీలు దొరికాయి. మరొకరు స్తంభాన్ని పట్టుకొని ప్రాణాలతో మిగిలారు. మిగతా ఆరు మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తి , శంషాబాద్ డిసిపి, సైబరాబాద్ సిపి సజ్జనార్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూచనలు ఇచ్చారు. వీళ్లంతా ఎటు మిస్ అయ్యారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రిస్కీ ఆపరేషన్ కావడంతో పోలీసులు స్థానికులు.. నిపుణులైన వారి సహకారంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.