రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లు తున్నాయి. భారీవర్షాలతో పలుప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయిం ది..ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ సిబ్బందిని, అధికారులను అప్రమత్తం చేసింది..రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు.. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు శ్రమిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా బీచురాజుపల్లి, మరిపెడ, బంగ్లాలో వరదనీటిలో చిక్కుకున్న 9మందిని ఫైర్ సిబ్బంది కాపాడింది.. సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా పలు వురు కాపాడారు రెస్క్యూ టీం సభ్యులు. కోదాడ ఎల్ ఐసీ ఆఫీస్ మెయిన్ రోడ్, కోదాడ బ్రిడ్జి దగ్గర , షిర్డీ సాయినగర్ లో దాదాపు 150 మందిని కాపాడి సురక్షిత ప్రాంతా లకు చేర్చారు.
ALSO READ | భారీ వర్షాలు.. తెలంగాణకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
కోదాడ పరిధిలోని తొగురై గ్రామంలో వరద నీటిలో ఆగిపోయిన కారులోంచి ఇద్దరు వ్యక్తులను రక్షించారు ఫైర్ సిబ్బంది. కోదాడ చెరువు లో వరదల్లో చిక్కుకుపోయిన ఇద్దరిని బోట్ల ద్వారా రక్షించారరు. మహబూబాద్ జిల్లాలో సూతరం తండా , ధర్మారంలో ఫైర్ డిపార్ట్ మెంట్ రెస్క్యూ టీం సక్సెస్ ఫుల్ పనిచేస్తోంది. సుమారు 100 మందిని సేఫ్ జోన్ కు తరలించారు.
సీతారాం తండా, ధర్మారం గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. మహబూబాబ్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో ఫైర్ సిబ్బంది అలెర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది.