
అచ్చంపేట/అమ్రాబాద్, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఆరుగురి డెడ్‌బాడీలను వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్‌లో జరుగుతున్న పనులపై స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ లోతేటి మంగళవారం రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆరుగురి డెడ్‌బాడీలను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. టన్నెల్‌లో ప్రస్తుతం టీబీఎం శకలాలు, మట్టి తొలగింపు, డీవాటరింగ్, కన్వేయర్ బెల్ట్ రిపేర్ పనులు జరుగుతున్నాయన్నారు.
త్వరలోనే ఆరుగురిని గుర్తిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రివ్యూలో నాగర్‌కర్నూల్ అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం, వివిధ విభాగాల ఆఫీసర్లు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, మాధవరావు, మన్మోహన్‌యాదవ్, సత్యనారాయణ, గిరిధర్‌రెడ్డి, జయప్రకాశ్, నేత చంద్ర, రవీంద్రనాథ్, ఫిరోజ్ ఖురేషి పాల్గొన్నారు.