టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ

టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ

అమ్రాబాద్, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్‌బాడీలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వందల మంది రెస్క్యూ సిబ్బంది 46 రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సోమవారం రెస్క్యూ సిబ్బంది టన్నెల్‌ లోపల 20 మీటర్ల మేర మట్టిని తవ్వి టీబీఎం శకలాలు, భారీ బండ రాళ్లను బయటకు తీసుకొచ్చారు. మరో 80 మీటర్ల మేర తవ్వకాలు జరపాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. 

టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సుమారు 500 మంది రెస్క్యూ సిబ్బంది మూడు షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీ స్థాయిలో వస్తున్న నీటిని మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు.