
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందున్నారు జీహెచ్ఎంసీ.. డీఆర్ఎఫ్.. ఫైర్ అధికారులు. హైదరాబాద్ లో ఈ రోజు ( ఏప్రిల్3) కురిసిన భారీ వర్షాలకు మూసీ నది వరద ప్రవాహం పెరిగింది. దీంతో చైతన్య పురి శివాలయం దగ్గర కూలి పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వరదలో చిక్కుకున్న వారిని రోప్ సహాయంతో కాపాడారు. వరదలో చిక్కుకున్న వీరయ్య.. నరేంద్రలను కాపాడినందుకు స్థానికులు.. రెస్క్యూ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు.
ALSO READ| Big Breaking: పెరిగిన మూసీ ప్రవాహం... వరదనీటిలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు
మూసీలో చిక్కుకున్న వీరయ్య ... నరేంద్ర లు నిర్మాణ పనులకు పురమాయించిన ఆలయ కమిటీకి తాము వరద ఉధృతి లో చిక్కుకున్నామని తెలియజేయడంతో ఆలయ కమిటీ వారు . ఎల్బీనగర్ జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుజాత, చైతన్య పురి కార్పొరేటర్ రంగ నర్సింహ గుప్తకు సమాచారం అందించారు. తరువాత వారు రెస్క్యూ బృందాలు కోసం హైడ్రా కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం రోప్ సాయంతో మూసీ నదిలోకి వెళ్లి చిక్కుకున్న వారిని కాపాడారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగించడంతోపాటు రోడ్లు కొట్టుకపోయిన చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాలను మళ్లించడం ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.