ఇంకా 50 మీటర్లే మిగిలిన రెస్క్యూ ఆపరేషన్.. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో స్పీడ్ గా పనులు

ఇంకా 50 మీటర్లే మిగిలిన రెస్క్యూ ఆపరేషన్.. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో స్పీడ్ గా పనులు

 

 

  • మీడియాతో స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ 

అమ్రాబాద్, వెలుగు: ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ గా కొనసాగుతోంది. స్పెషల్ ఆఫీసర్ శివ శంకర్ పర్యవేక్షణలో అత్యున్నత టెక్నాలజీ మెషీన్లతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. 57వ రోజు టన్నెల్ లోపల శాస్త్రవేత్తలు, టన్నెల్ నిపుణుల సూచనలతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టన్నెల్ లోపల మరో 50 మీ పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.  

నీటి ప్రవాహం వేగంగా వస్తుందని, నివారించేందుకు భారీ మోటార్లతో డీ వాటరింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చివరి వరకు వెంటిలేషన్ సదుపాయం ఉందని, రెస్క్యూ టీమ్ కు అవసరమైన అన్ని వసతులు సమకూర్చినట్లు చెప్పారు. కన్వేయర్ బెల్ట్ సాయంతో మట్టిని ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నామన్నారు.  

ఒకటికి రెండు సార్లు మట్టిని క్షుణ్ణంగా పరిశీలించి ఆరుగురి ఆచూకీని కనుగొంటున్నట్టు తెలిపారు. టీబీఎం పార్ట్స్ ను లోకో  ట్రెయిన్ ద్వారా వెంటవెంటనే బయటకు తెస్తున్నామన్నారు. ఇందులో అన్ని రకాల రెస్క్యూ టీమ్ లు పాల్గొంటున్నాయన్నారు.  ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నామన్నారు.