ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ

ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ
  • రెండో డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ దొరికిన పాయింట్‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేసిన సిబ్బంది

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌/అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీడీ టన్నెల్‌‌‌‌‌‌‌‌లో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ మనోజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని గుర్తించిన ప్రదేశంపైనే ఫోకస్ చేసిన రెస్క్యూ టీమ్స్‌‌‌‌‌‌‌‌ బుధవారం అక్కడే తవ్వకాలు జరిపాయి. టన్నెల్‌‌‌‌‌‌‌‌ చివరి నుంచి 60 మీటర్ల దూరంలో కూరుకుపోయిన లోకో ట్రైన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గుర్తించిన టీమ్స్​ఎస్కవేటర్ల సాయంతో మట్టి, రాళ్లు, ఇతర పరికరాలను తొలగిస్తున్నారు. ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మరికొందరి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలు ఉండొచ్చని రెస్క్యూ టీమ్స్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నాయి.

టన్నెల్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌ వెంటిలేషన్‌‌‌‌‌‌‌‌ సమస్య రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌కు ఆటంకంగా మారుతోంది. సహాయక చర్యలపై డిజాస్టర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ స్పెషల్ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అర్వింద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శివ శంకర్‌‌‌‌‌‌‌‌ లోతేటి, ఆర్మీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ వికాస్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ హరీశ్‌‌‌‌‌‌‌‌, సింగరేణి మైన్స్‌‌‌‌‌‌‌‌ రెస్క్యూ జీఎం బైద్య పాల్గొన్నారు.

2.5 కిలోమీటర్లకు ఒక డీవాటరింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌

టన్నెల్‌‌‌‌‌‌‌‌ లోపల నిరంతరాయంగా ఊట వస్తుండడంతో డీవాటరింగ్‌‌‌‌‌‌‌‌ కోసం 2.5 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌‌‌‌‌‌‌‌ చొప్పున మొత్తం ఐదు పంపింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిమిషానికి 3,600 లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి వదులుతున్నారు. టన్నెల్‌‌‌‌‌‌‌‌ లోపల 13.600 కిలోమీటర్ల వరకు లోకో ట్రాక్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. లోకో ట్రాక్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి వస్తే మట్టి, రాళ్లు, స్టీల్‌‌‌‌‌‌‌‌ పార్ట్స్‌‌‌‌‌‌‌‌ను స్పీడ్‌‌‌‌‌‌‌‌గా బయటికి తరలించే అవకాశం ఉంటుంది.