ఉత్తరకాశీ సొరంగంలో కార్మికులు సేఫ్ గానే ఉన్నారు..ఇంకో 60 మీటర్లు తవ్వితే బయటపడ్డట్టే..

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న  సొరంగంలో చిక్కకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ ఏడో రోజుకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం వరకు కూలిపోయిన సొరంగంలో 24 మీటర్ల వరకు శిథిలాల ద్వారా డ్రిల్ చేయగలిగారు ఇప్పటివరకు రెస్క్యూ వర్కర్లు. కార్మికులు సురక్షితంగా బయటపడాలంటే మరో 60 మీటర్లు శిథిలాల గుండా డ్రిల్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. 

ALSO READ :- బాల్క సుమన్కు నిరసన సెగ.. అడ్డుకున్న రైతులు

నిన్న సాయంత్రం (శుక్రవారం )  ఆకస్మాత్తుగా పగుళ్ల శబ్ధం వినిపించడంతో డ్రిల్లింగ్ మెషిన్ పనులు నిలిపివేశారు. నిన్న ఆగర్ మెషిన్ తెప్పించి కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ అధికారులు ప్రయత్నిస్తుండగా.. టన్నెల్ లో ఒక్కసారిగా పెద్దగా  కూలిన శబ్దం వినిపించడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. శిథిలాల తొలగింపులో భాగంగా ఇండోర్ నుంచి మరో మెషీన్ తెప్పిస్తున్నారు. ఇవాళ సైట్ కి చేరుకుంటుంది.