గాంధీలో రీసెర్చ్​ మెథడాలజీపై వర్క్‌‌‌‌ షాప్ ​

గాంధీలో రీసెర్చ్​ మెథడాలజీపై వర్క్‌‌‌‌ షాప్ ​

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో మూడు రోజుల పాటు జరిగే రీసెర్చ్ ​మెథడాలజీ రాష్ర్ట స్థాయి వర్క్​షాప్ ​మంగళవారం ప్రారంభమైంది. ఈ వర్క్​ షాప్‌‌‌‌ను కాలేజీ ప్రిన్సిపల్​ డాక్టర్ కె. ఇందిరా సూపరింటెండెంట్​ప్రొ.రాజకుమారి  జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రిన్సిపాల్​ డా.ఇందిరా మాట్లాడుతూ..2018 నుంచి గాంధీ మెడికల్ కాలేజీలో మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్​ యూనిట్​ కొనసాగుతుందన్నారు. సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిగా గొప్ప వైద్య సేవలను అందిస్తూ, సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్సీగా ఖ్యాతి గాంచిందన్నారు.  రీసెర్స్​ మెథడాలజీ విధానాలపై వైద్యులకు ఈ వర్క్​ షాప్​ ద్వారా మరింత అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. గాంధీ మెడికల్ ​కాలేజీ  ప్రొఫెసర్లు విజయ్​ శేఖర్​ రెడ్డి, నెఫ్రాలజీ హెచ్​ఓడీ ప్రొఫెసర్​ ఎ.మంజూష, ప్రొఫెసర్​ డాక్టర్​ భువనేశ్వరీ, ప్రొఫెసర్​ శివప్రసాద్​ గౌరవ్​, మంజునాథ్​, డాక్టర్​ తరుణ మదన్​గుప్తా, డాక్టర్​ తను ఆనంద్​పలు అంశాలపై ప్రసంగించారు.