రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్వర్శిటీలో రీసెర్చ్స్పేస్సెంటర్ను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ జనరల్మేనేజర్ఎస్కె చౌరాసియా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూల్ఆఫ్టెక్నాలజీ, ఇంజినీరింగ్ విభాగాల మధ్య ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ రీసెర్చ్స్పేస్ సెంటర్ఉపయోగపడుతుందన్నారు.
మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్, ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాలకు ఉమ్మడి కేంద్రంగా ఈ స్పేస్ సెంటర్ పని చేస్తుందన్నారు. దీనిద్వారా పరిశోధనా నైపుణ్యాలను పెంచుకొని కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలని స్టూడెంట్స్కు సూచించారు. కార్యక్రమంలో స్కూల్ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి, వివిధ విభాగాల అధిపతులు, ఆయా బ్రాంచ్ల ఫ్యాకల్టీ పాల్గొన్నారు.