బంగ్లాదేశ్​లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి

బంగ్లాదేశ్​లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి

ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులకు ఇస్తున్న రిజర్వేషన్లను తొలగించాలని  బంగ్లాదేశ్ వర్సిటీల్లో స్టూడెంట్లు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లల్లో ఇప్పటిదాకా 32 మంది చనిపోయారు. వారం ప్రారంభంలో 7గురు మరణించగా..గురువారం ఒక్కరోజే 25 మంది చనిపోయారు. మరో వెయ్యి మంది గాయపడ్డారు. 

గురువారం నిరసనకారులు బీటీవీ ప్రధాన కార్యాలయానికి నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది నిరసనకారులు బీటీవీ ఏరియాలోకి దూసుకెళ్లారు. ఆఫీసుతో పాటు సిబ్బందికి చెందిన 60 వెహికల్స్ ను తగలబెట్టేశారు. 32 మంది చనిపోవడానికి కారణమైన ప్రధాన మంత్రి షేక్ హసీనా వెంటనే క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.