బీసీల రిజర్వేషన్లు పెంచాలి

  • ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య 

బషీర్ బాగ్ , వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే  బీసీల రిజర్వేషన్లు 20 నుంచి 42 శాతానికి  పెంచాలని  రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రిజర్వేషన్ల పెంపు పై జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన కోరారు.  జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నీల వెంకటేశ్ అధ్యక్షతన కాచిగూడలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ..   మూడు శాతం లేని అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేరా..? అని ప్రశ్నించారు. సమావేశంలో సంఘాల నాయకులు డాక్టర్ అరుణ్ , గోరిగే మల్లేశ్ , గుజ్జ  సత్యం , అంజి , వేముల రామకృష , పృథ్వీగౌడ్, రమాదేవి ,  రాందేవ్ , ఉదయ్  పాల్గొన్నారు.