Good News : నేపాల్ లోనూ మన UPI పని చేస్తుంది

ఒక దేశ కరెన్సీ మరో దేశంలో చెల్లదు. అయితే ఇప్పుడంతా  ఆన్ లైన్ ట్రాన్ సెక్షన్స్ యే   కదా అవిఅయినా నడుస్తాయా అని అనుమానం మీకు రావొచ్చు. ఆన్ లైన్ చెల్లింపులు కూడా వేరే దేశంలో కుదరదు. ఇలా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ పేమెంట్స్ చెల్లుబాటు కావాలంటే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇలాంటి అగ్రిమెంట్ యే నేపాల్, భారత్ దేశాలు చేసుకున్నాయి. ఇండియా – నేపాల్ సరిహద్దులోని ప్రజలకు చెల్లింపులను సులభతరం చేయడానికి రెండు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 

భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో రెండు దేశాల పౌరులు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. భారత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) , నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (NPI) ఏకీకరణ కోసం సంతకాలు చేశాయి. ఇక నుంచి భారత్ యూపీఐ పేమెంట్స్ నేపాల్ లో కూడా చెలామని అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.  ఇరు దేశాల బార్డర్ లో ఉండే పౌరులు ఈజీగా ఆన్ లైన్ ట్రాన్ సెక్షన్స్ చేసుకోవచ్చు.