బీ అలర్ట్ : ఈ వాలెట్స్ నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపు కట్

బీ అలర్ట్ : ఈ వాలెట్స్ నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపు కట్

విద్యుత్ ఛార్జీలు వసూలులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులలో థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ అనుమతి ఇవ్వొదని పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వినియోగదారులకు ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది.  థర్డ్ పార్టీ ఆన్లైన్ పేమెంట్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే యాప్ ల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు వినియోగదారులకు TGSPDCL తెలిపింది. ఆన్ లైన్ లో కరెంట్ బిల్ కట్టాలంటే TGSPDCL  వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే చెల్లించాలని సూచించింది.