దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. నిండుకుండల్లా రిజర్వాయర్లు..

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. నిండుకుండల్లా రిజర్వాయర్లు..

దేశంవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో రిజర్వాయర్లు  నిండుకుండల్లా మారాయి. జలపాతాలు పొంగిపొర్లుతుండగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఇవాళ ఢిల్లీలో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజామును కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలవడంతో..వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాకేట్ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు నిలిచింది

మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ తో ముంబైలోని విద్యాసంస్థల్లో జరిగే పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. పాల్ఘర్, పూణే, రాయ్ ఘడ్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. ఇక గుజరాత్ లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో గిరా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకులను అనుమతించడం లేదు.